Halloween Costume ideas 2015
[ads-post][random][list]

చిరంజీవి 150వ చిత్రానికి శభముహూర్తం ఫిక్స్


ఎప్పుడెప్పుడా అంటూ మెగాస్టార్ అభిమానులు గత కొన్నాళ్లుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 29 తరువాత పుష్కరాలు, మూడాల నేపథ్యంలో ఎలాంటి శుభముహుర్తాలు లేనందున.. ఆ లోపుగానే తన 150వ చిత్రానికి ముహుర్తాన్ని ఫిక్స్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇక త్వరలోనే చిరు 150 చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను చేపట్టి సెట్ పైకి రానుంది. 

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించిన చిరంజీవి.. తన 150వ చిత్రానికి..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ 'కత్తి’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

ఈ ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరుకానున్నట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి తగిన విధంగా, మెగా అభిమానులకు నచ్చే విధంగా మార్పుల చేసిన అనంతరం కథను వివి వినాయక్ ఫైనల్ చేశారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సంవత్సరం మొదటల్లోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడిందని సినీవర్గాల టాక్.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తరువాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిరంజీవి గత కొన్నాళ్ళుగా సినిమా పరిశ్రమకు దూరంగా వున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ సినిమా ఫంక్షన్ లో తాను 150వ చిత్రంలో నటించనున్నట్లు చిరు ప్రకటించి తన అభిమానులో అశలను రేపారు. అది మొదలుకుని ఎప్పడెప్పుడా అంటూ మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటం మొదలైంది. ఈ నేపథ్యంలో వారి నిరీక్షణ ఫలించి.. ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది. మాస్ మసాలా ఎంటర్టెనర్ గా, అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా రూపోందించనున్నారు వినాయక్. పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న వినాయక్ మెగా అభిమానుల కరువును తీర్చనున్నారు.
Labels:

Post a Comment

Todywindow

{facebook#https://www.facebook.com/} {twitter#https://twitter.com/} {google-plus#https://plus.google.com}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget