Halloween Costume ideas 2015
[ads-post][random][list]

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రివ్యూ


సినిమా : స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌
బ్యాన‌ర్‌: ప‌వ‌న్ క‌ళ్యాన్ క్రియేటివ్ వ‌ర్క్స్ మరియు నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులు: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ‌ర‌ద్ కేల్క‌ర్‌, బ్ర‌హ్మానందం, సంజ‌న‌, రాయ్‌ల‌క్ష్మీ, తనికెళ్ళ భరణి, రావు  రమేష్, ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, కబీర్ సింగ్, ఆలీ , పోసాని కృష్ణ మురళి, ఊర్వశి త‌దిత‌రులు
మాట‌లు: బుర్రా సాయి మాధ‌వ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్థ‌ర్ విల్స‌న్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌
స్టోరీ-స్ర్కీన్ ప్లే: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
నిర్మాత‌లు : సునీల్ లుల్లా , శరద్ మరాట్
ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర‌(బాబి)

సర్ధార్ గబ్బర్ సింగ్. రతన్ పూర్ లో భైరవ్ సింగ్ చేస్తున్న అరాచకాలకు అడ్డు కట్ట సర్ధార్ ఎలా వేస్తాడు..రాజకుమారి హర్షిణి తో సర్ధార్ గబ్బర్ సింగ్ కు ఉన్న సంబంధం ఏమిటీ..? ప్రజలను ఎలా కాపాడుతాడు.. అన్న విషయాన్ని వెండి తెరపై చూడాల్సిందే..

2016 లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఉన్న తారాగణం కంటే భారీ తారాగణం సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కనిపిస్తారు. అయితే ఎనభై శాతం వరకు మాత్రం సినిమా స్క్రీన్ పై హీరో, హీరోయిన్ మరియు విలన్ మాత్రమే కనిపిస్తారు. అలాంటపుడు ఇంత భారీ తారగణాన్ని ఎందుకు తీసుకున్నారో అర్ధం కాని విషయం.
పవన్ కళ్యాన్ ని అభిమానులు పిలుచుకునే ముద్దుపేరు పవర్ స్టార్.. కానీ ఆ పవర్ ఈ సారి పవన్ లో నటనలో మిస్ అయ్యింది. సర్ధార్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కి ఒక ‘తమ్ముడు’ సినిమాలాగానో ఒక ‘జానీ’ సినిమా లాగానో డైలాగులు చెబితే ఎలా ఉంటుంది..? అంతే కాకుండా సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ఆన్ స్క్రీన్ కూడా చాలా డల్ గా.. అలసిపోయిన వాడిలా కనిపించాడు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి..తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా తనను తాను తగ్గించుకొని చేసిన సన్నివేశాలు, పవన్ కళ్యాన్ కొత్తగా చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగున్నాయి.

ఒక కథానాయిక రాకుమారి వేషం వేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా తూచినట్లు అలాగే చేయగలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. గతంలో మగధీర నుండి నేటి సర్ధార్ గబ్బర్ సింగ్ వరకు నటనలో ఠివీ, పలుకులో స్పష్టత, రాజకళ, ఆహార్యం అన్ని విషయాల్లో కాజల్ తన కెరీయర్ బెస్ట్ ఈ సినిమాకు ఇచ్చింది.
బాలీవుడ్ కు చెందిన శరద్ కేల్కర్ మిస్టర్ ఇండియా 2015 ఫైనలిస్ట్ . చాలా మంచి క్యారెక్టరైజేషన్ ఉన్నా విలన్ పాత్ర లభించింది. రాజా భైరవ్ సింగ్ గా రాజదర్భం వెళ్లబోస్తూనే జనాలను కర్కశంగా ఇబ్బంది పెట్టేవాడికి క్రూరుడిగా శరద్ నటన అద్భుతంగా ఉంది. ఇంత మంచి విలన్ క్యారెక్టర్ చేసిన శరద్ ఇంట్రవెల్ తర్వాత నుంచి ఏదో ఉన్నానంటే ఉన్నానంటూ తను చేయడానికి ఎక్కువ స్కోపు లేదు. పోసాని, ముఖేష్ రిషి, రావు రమేష్, బ్రహ్మనందం,ఆలి, తనికెళ్ల భరణి మరియు భారీ తారాగణం స్క్రీన్ పై అలా వస్తూ ఇలా వెళ్లిపోయారు..కొంత మందికి అసలు డైలాగులే లేవు.

సర్ధార్ గబ్బర్ సింగ్ కి దేవిశ్రీ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడనే చెప్పవచ్చు. ఆల్ మోస్ట్ ప్రతి పాటకు మంచి సంగీతం అందించడమే కాకుండా.. సిచ్ వేషన్లకు తగ్గట్లు బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రతి ఒక్క సన్నివేశానికి దానికి తగ్గట్టు గా ఎమోెషన్ ని తీసుకురాగలిగాడు. ఇక కెమెరామెన్ ఆర్థర్ ఎ.విల్సన్ పనితనం చాలా గొప్పగా చూపించాడు. క్లోజప్ షాట్స్, స్లోమోషన్స్ షాట్స్, నేచురల్ సీనరీస్, కోటలను చూపించిన విధానం..ఇలా అన్ని విషయాల్లో ఆర్థర్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

పవన్ కళ్యాన్ స్వతహాగా మంచి మార్షల్ ఆర్టిస్ట్ కావడం వల్ల అటువంటి హీరోకి ఎలాంటి ఫైట్స్ ఉండాలో సరిగ్గా అదేసన్నివేశాలను తెరకెక్కించారు ఫైట్ మాస్టర్స్ రామ్ — లక్ష్మణ్. సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది..రతన్ పూర్. ఒక ఖాళీ ప్రదేశాన్ని రతన్ పూర్ లాంటి గ్రామంగా మలిచిన బ్రహ్మ కడలి నిజంగా మెచ్చుకోవచ్చు..రతన్ పూర్ లో ఒకవైపు పేదరికాన్ని చూపిస్తేనే..మరో వైపు రాజ కోట..దానికి హంగులూ చాలా గొప్పగా చూపించాడు.
పవన్ కళ్యాన్ స్వంతంగా రాసుకున్న కథ ప్రధమార్థం ఫరవాలేదు అనిపించినా ద్వితీయార్థం చేరేటప్పటికీ అతుకుల బొంతలా తయారైంది. దాదాపు 40 నిముషాల పాటు సినిమాలో ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్ధం కాలేదంటే నే తెలుస్తుంది..పకడ్బందీగా కథ-కథనం లేదన్న విషయం.
ఇక దర్శకుడు కొర్లి సంతోష్ రవీంద్రనాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులను ఎటువంటి సన్నివేశాలు కావాలో సరిగ్గా అవే రాసుకున్నారు. ఎలా చూపించాలో అలా బ్రహ్మాండంగా చూపించారు. కానీ సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి నచ్చాలంటే హరో గురించే కాకుండా కథ, కథనం,మాటలు కూడా అత్యవసరం అనే విషయాన్ని మరిచిపోయారేమో అనిపించింది.

మిగిలిన వారి గురించి చెప్పడానికి అంత పెద్ద విషయం లేదు.

సూర్య అనేది ఒక పేరు కాదు — అది ఒక బ్రాండ్. ఏ ముహూర్తన పూరీ జగన్నాధ్ ఈ డైలాగు రాసుకున్నాడో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి చాలా చక్కగా సరిపోతుంది. గత రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ రాజకీయ, కథానాయకుడిగా ఎక్కువ మాట్లాడుకున్నది పవన్ కళ్యాన్ గురంచే..గబ్బర్ సింగ్ తర్వాత మూడేళ్ల సమయంలో వెంకేటేష్ తో నటించిన ‘గోపాల గోపాల ’ చిత్రంలో అది కూడా ఇంట్రవెల్ తర్వాత కనిపిస్తాడు.

సగటు సినీ ప్రేక్షకుడి నుంచి పవన్ కళ్యాన్ అభిమానుల వరకు అందరూ ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా . సినీ పండితులు, వ్యాపార మేధావులు కూడా ఎదురు చూసిన సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్. ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా సీక్వెట్ తీసి హిట్ కొట్టిన వారు లేరు, రామ్ గోపాల్ వర్మ మనీ-మనీ నుంచి మొన్న వచ్చిన యముడ్ని వరకు ఇది తేట తెల్లం అయ్యింది.

ఇటువంటి వాతావరణంలో తెలుగు సినీ దేవుడు పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ వాటన్నింటిని మారుస్తుంది అని ఆశించిన వారిలో మా విశ్లేషక బృందం ఒకటి. ఈ సినిమా నా అభిమానులకు అంకితం అని పవన్ కళ్యాన్ సంతకంతో మొదలు పెట్టి సినిమా ఒక అభిమానుల కోసంమే తీసుకున్నారేమో అని అనిపించేలా మొదటి పార్ట్ నడిచింది.
కథ-మాటలు-కథనం వీటన్నింటికంటే పవన్ కళ్యాణే కొండంత కనిపించాడు. పవన్ కళ్యాన్ లో ఉన్న నటుడికి అవకాశం కల్పించే సన్నివేశం కాకుండా పవన్ కళ్యాన్ ఒక ప్రజా నాయకుడు, ఒక అతీత శక్తి అనిపించే విధంగా సన్నివేశాలు.. మద్య మద్యలో మాస్ హీరోయిజం ఎలిమెంట్స్ తో బావుందిలే అనిపించే సినిమాని..ద్వితీయార్ధంలో కథకు ఇబ్బంది పెట్టే అర్ధం లేని సీన్లతో నింపేయడం వల్ల ఒక పక్క కళ్యాన్ బాబు ఏదైనా చేయగలడు అనేది చూపిస్తూనే రెండో పక్క రోడ్ సైడ్ డ్యాన్స్ చేయించడంలోనూ అసలు హీరో క్యారెక్టరైజేషన్ కి ఒక ఐడేంటిటీ లేకుండా పోయింది.

ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాంతాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ గా వచ్చి కాపాడుతాడు అనే పాత చింతకాయ పచ్చడి కథను తీసుకొని ఎటువంటి కొత్తదనం లేకుండా

ప్లస్ పాయింట్స్ :
ప‌వ‌న్‌-కాజ‌ల్ మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్‌
సినిమాటోగ్రఫీ
రీ రికార్డింగ్
ఫస్టాఫ్  
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
రొటీన్ స్టొరీ
ఫ్లాట్ నెరేష‌న్
రొటీన్ క్లైమాక్స్‌
 
రేటింగ్ : 3.0/5
Labels:

Post a Comment

Todywindow

{facebook#https://www.facebook.com/} {twitter#https://twitter.com/} {google-plus#https://plus.google.com}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget