Halloween Costume ideas 2015
[ads-post][random][list]

ఫార్ములా ఎక్స్ టైటిల్


ఎ స్క్వేర్.. బి స్క్వేర్ అంటూ ‘100 పర్సంట్ లవ్’లో లెక్కలతో పాట పాడించారు దర్శకుడు సుకుమార్. ‘నాన్నకు ప్రేమతో’లో ఏకంగా ఫైట్‌ని కూడా లెక్కలతోనే తీశారు. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టారు కదా. అందుకే లెక్కలను ఇష్టపడతారు. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సుకుమార్ కథ రాసుకుంటున్నారు. ఈ చిత్రానికి కూడా ఓ లెక్క ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే, దీనికి ‘ఫార్ములా ఎక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.

ఇది సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని సమాచారం. సుకుమార్ స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రం కూడా అదే పంథాలోనే ఉంటుందట. సుకుమార్ తెరకెక్కించిన అన్ని సినిమాలకూ స్వరకర్తగా వ్యవహరించిన దేవిశ్రీ ప్రసాద్‌ను ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఖరారు చేశారట.  ఈ వార్తే నిజమైతే, ఇప్పటివరకూ లవ్, ఫ్యాంటసీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో నటించిన రామ్‌చరణ్ తొలిసారి సైన్స్ ఫిక్షన్ స్టోరీలో కనిపిస్తారు. ప్రస్తుతం చరణ్ ‘ధ్రువ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో చేసే సినిమా ఆరంభం అయ్యే అవకాశం ఉందని ఊహించవచ్చు.
                                                                                                                                              సాక్షి దినపత్రిక
Labels:

Post a Comment

Todywindow

{facebook#https://www.facebook.com/} {twitter#https://twitter.com/} {google-plus#https://plus.google.com}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget