Halloween Costume ideas 2015

అంతం తెలుగు సినిమా రివ్యూ




నటీనటులు : రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్
ప్రొడక్షన్ బ్యానర్ : చరణ్ క్రియేషన్
దర్శకత్వం, నిర్మాత:జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
రేటింగ్ : 2/5

కథ..

కళ్యాణ్ (చరణ్), వనిత (రేష్మి) బార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. కళ్యాణ్ ఒక పని మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళతాడు. పని చూసుకొని తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా దారిలో సుదర్శన్ కలుస్తాడు. ఇంతలో ఒక కొత్త వ్యక్తి కళ్యాణ్ భార్యని కిడ్నాప్ చేసి, తను చెప్పిన పని చెయ్యకపోతే నీ భార్యని చంపుతానని బెదిరిస్తాడు. కళ్యాణ్ అతను చెప్పిన పని చెయ్యడానికి అంగీకరిస్తాడు. ఈ మిషన్ లో కళ్యాణ్ అకౌంట్లో   20 లక్షలు వేసి, ఒక విలేజ్ కి వెళ్లి అక్కడ బస్ స్టాప్ లో డీవీడీ కలెక్ట్ చేసుకొని, అక్కడ నుంచి మరో విలేజ్ కు వెళ్లి అక్కడ ఒక బ్యాగ్ తీసుకోని అందులో ఏమి ఉందో చూడాలి. కళ్యాణ్ ఏమి తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, తరవాత ఏమౌతుంది? అనేది మిగిలిన కథ.

నటీనటుల ప్రతిభ

అంతం అంటూ వచ్చిన రష్మి నిజంగానే వనిత పాత్రలో ఆడియెన్స్ ను అందాలతో అంతం చేసినట్టుగా అనిపిస్తుంది. బుల్లితెర మీద తనకున్న ఇమేజ్ తో రీసెంట్ గా గుంటూర్ టాకీస్ తో అదరగొట్టిన ఈ అమ్మడు మరోసారి సినిమాలో గ్లామర్ షోతో కట్టిపడేసింది. అయితే సినిమాలో కేవలం హాట్ గా కనిపించడానికే తప్ప రష్మి క్యారక్టర్ ఏమి లేదని చెప్పాలి. ఇక హీరోగా నటించిన చరణ్ దీప్ పర్వాలేదు కాని అతనిలో హీరో లక్షణాల కన్నా విలన్ గానే బాగా అనిపిస్తాడు. సినిమాలో సుదర్శన్ కామెడీ చేయాలని ప్రయత్నించాడు కాని అదేం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వాసుదేవ్ విలనిజం పర్వాలేదు. అయితే పాత్రలన్ని నటిస్తున్నారన్న భావన కలుగుతుంది. ఆ విషయంలో దర్శకుడు వారి నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకోలేకపోయాడు.  

దర్శకత్వం 

 "మీ ఊహలకందనిది జరగబోతుంది" అంటూ ప్రచార చిత్రాల్లో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేక్షకుడు మాత్రం సినిమా చూస్తున్నంతసేపు 'తర్వాత ఏం జరుగుతోంది' అన్న విషయంలో దర్శకుడ్ని మించి క్లారిటీతో ఉంటాడు. అయితే దర్శకుడు తీసిన పద్దతికి ప్రేక్షకుడు ఏ స్థితిలో ఉంటాడన్నది పైవాడికే ఎరుక. తెలుగు సినిమా మొహం మొత్తేసిన ఉగ్రవాద నేపథ్యంలో రాసుకున్న అతి సాధారణమైన కథకి దర్శకుడు తన ప్రతిభని కనబరిచే ప్రయత్నంలో ప్రేక్షకుల సహనం అన్న మాటని పూర్తిగా మరిచాడు. సినిమా ప్రారంభమై రేష్మితో ఓ పాటేసుకున్నాక (ఇదంతా ఓ పది నిమిషాల్లోనే) మొదలైన కిడ్నాప్ డ్రామా రెండు నిమిషాల్లో శుభం కార్డు పడుతుందనే వరకు సా...గుతూనే ఉంది. అప్పటిదాకా కిడ్నాపర్ల బారిలో తన్నులు తిని తిన్నగా ఏడవటం కూడా చేతకాని రేష్మి ఉన్నట్టుండి 'పోకిరి'లో మహేష్ బాబులా అండర్ కవర్ - ఐపీఎస్ అని లేచి అమాంతం ఉగ్రవాదుల్ని మట్టి కరిపించేస్తుంది. ఆ విషయం అంతవరకు ఆమె భర్తకీ తెలియకపోవడం కొసమెరుపు. ఇలా తన పగటి కలల్ని తెరపై చూపించి ప్రేక్షకులపై రుద్దాడు దర్శక నిర్మాత హీరో ఎక్సట్రా... అయిన చరణ్ దీప్. ప్రధాన పాత్రలు రెండే కావటంతో కథనాన్ని మరోవైపు నడిపించే అవకాశమూ లేదు. ఉన్నంతలో నెల్లూరు యాసలో సుదర్శన్ పలికిన సంభాషణలే దిక్కు. అదీ బిగుతుగా కట్టని 'లుంగీ'లానే ఉంది. "స్వర్గం చూపిస్తా..." అన్న మాట పక్కనపెడితే అర్థం పర్థం లేని సన్నివేశాలు, కిడ్నాపర్లు వనిత (రేష్మి)ని కారణం లేకుండా హింసించడం (మగాడు మూత్రం పోసే సన్నివేశాన్ని చూడమంటూ కొట్టడం) లాంటివి చూసి ఉన్నపళంగా నరకంలోని సలసలా కాగుతున్న నూనెలో పడ్డట్టు ఫీలవుతాడు ప్రేక్షకుడు.

Labels:

Post a Comment

facebook
blogger

Todywindow

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget